
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటల గారడి మనకు తెలిసిందే.. తన సినిమాలో కథా కథనాలు ఎంత బలంగా ఉంటాయో అలానే మాటల తూటాలు కూడా అంతే బలంగా తగులుతాయి. అసలు ఓ సందర్భం వాడుకోవడంలో ఆయన రాసే డైలాగ్స్ అదరహో అనిపిస్తాయి. అలా ఆడియెన్స్ మనసుని కదిలించిన త్రివిక్రమ్ మార్క్ డైలాగులు ఎన్నో. అయితే ఆయన ఫాంలోనే ఉన్నా అతన్ని ఇమిటేట్ చేసే వారు చాలామందే ఉన్నారు. ఇక ప్రస్తుతం త్రివిక్రం రేంజ్ డైలాగ్స్ తో సినిమాను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాడు అవసరాల శ్రీనివాస్.
ఓ పక్క నటుడిగా బిజీగా ఉంటూనే మరో పక్క దర్శకుడిగా తన మార్క్ సినిమాలతో అలరిస్తున్నాడు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తన స్పెషాలిటీ ఇది అని చాటిచెప్పిన అవసరాల, నిన్న రిలీజ్ అయిన జ్యో అచ్యుతానంద సినిమాతో తన ప్రతిభ చాటుకున్నాడు. తెలుగు ప్రేక్షకులను మనసుని తాకే డైలాగ్స్ తో కొడితే ఆదరిస్తారనే విషయాన్ని కనిపెట్టిన అవసరాల, జ్యో అచ్యుతానంద సినిమాలో అదే పద్ధతిని ఫాలో అయ్యి అదిరే హిట్ అందుకున్నాడు.
ఇక ఈ హిట్ తో తనని మరో త్రివిక్రమ్ అంటున్నారు సినీ జనాలు. ఇక ఈ సినిమాలో రోహిత్, నాగ శౌర్య, రెజీనాలు కూడా తమ పాత్రలకు ప్రాణం పోసారు. కథ చిన్నదే కాన్ని దాన్ని కథనంతో పాటుగా మాటల గారడితో నడిపించిన అవసరాల శ్రీనివాస్ మరో మంచి దర్శకుడు అవుతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి అవసరాల ఇదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే టాప్ డైరక్టర్ అవడానికి అంత టైం కూడా పట్టదేమో అనిపిస్తుంది.