
టాలీవుడ్లో ఏదైనా సినిమా హిట్ కొడితే ఆ హిట్ ను ఎంకరేజ్ చేసి అందరితో షేర్ చేసుకునే వ్యక్తుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. తానో స్టార్ హీరో మరో స్టార్ హీరోని పొగడటం ఏంటి అని లేక్కలేమి వేసుకోకుండా వెంకటేష్ ఎప్పుడు మిగతా హీరోలను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. ఇక అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ గురించి కూడా తన విశెష్ అందించారు వెంకటేష్.
సినిమా చూశానని.. ఎన్టీఆర్, మోహన్ లాల్ అద్భుతంగా నటించారని.. సినిమా మొత్తం ఓ ఎమోషనల్ డ్రామాగా సాగింది.. టీం మొత్తానికి కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు వెంకటేష్. ఇక వెంకటేష్ విశెష్ తో జనతా టీంలో మరింత జోష్ వచ్చిందని చెప్పాలి. ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిన తర్వాత మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివకు కాల్ చేసి విష్ చేసిన సంగతి తెలిసిందే. తారక్ ను కొత్త కోణంలో చూపించి అదిరే హిట్ అందుకున్న కొరటాల శివ కమర్షియల్ సినిమాల్లో కూడా కథాబలం ఉంటే ఏ రేంజ్ హిట్ అందుకోగలరో తన మూడు సినిమాల ద్వారా చెప్పగలిగాడు.
ప్రస్తుతం సక్సెస్ జోరులో ఉన్న తారక్ ఇప్పటికే సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజే చిత్రయూనిట్ తో పార్టీ చేసుకోగా.. ఈరోజు సాయంత్రం సినిమా సక్సెస్ అయినందుకు సినీ సెలబ్రిటీస్ తో ఓ స్పెషల్ పార్టీ అరేంజ్ చేస్తున్నారట. కొద్ది కాలం ట్రాక్ తప్పినట్టు కనిపించిన జూనియర్ టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ ల హిట్ తో హ్యాట్రిక్ అందుకున్నాడు.