మహేష్-కొరటాల స్టోరీ లీక్..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు నాన్ బాహుబలి రికార్డులన్నిటిని బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. మిర్చి తర్వాత కొరటాల మీద ఉన్న నమ్మకంతో శ్రీమంతుడు అవకాశం ఇచ్చిన మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుపుకున్నాడు. అయితే ఆ తర్వాత బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవ్వగా ప్రస్తుతం మురుగదాస్ సినిమా చేస్తున్నాడు మహేష్. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ కొరటాలతో సినిమాకు సిద్ధమయ్యాడు. 

స్టార్ తో సినిమా ఐనా గాని, కథాబలంతో కొరటాల వరుసబెట్టి క్రేజీ హిట్స్ కొడుతున్నాడు. రీసెంట్ గా జనతా గ్యారేజ్ హిట్ తో కొరటాల శివ టాప్ డైరక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. అయితే కొరటాల మహేష్ తో చేస్తున్న సినిమా కథ కూడా కొత్తగా ఉండబోతుందట. ఇక సినిమా కథ కూడా మనిషి తనను తాను ప్రేమించాలి ఆ తర్వాతే ఎదుటి వారిని ప్రేమించాలి ఇష్టపడాలి అనే లైన్ తో వస్తుందట. తనకు తాను అమితంగా ఇష్టపడితే ఇతరులు కూడా తనని ఇష్టపడతారు అనేది లైన్ అర్ధం తో సినిమా ఉంటుందట. 

సినిమా సినిమాకు కొత్త కథతో రికార్డుల సంచలనం సృష్టిస్తున్న కొరటాల శివ, మహేష్ సినిమాతో కూడా మరిన్ని రికార్డులు షురూ చేయడం కన్ఫాం అనిపిస్తుంది. ఇప్పటికే మహేష్ తో కథా చర్చలు ముగియగా మురుగదాస్ సినిమా పూర్తికాగానే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది. మరి మహేష్ కొరటాల కాంబినేషన్ ఈసారి ఏ రేంజ్ సినిమాతో వస్తారో చూడాలి.