'గురు' అంటూ గురి పెడుతున్న వెంకటేష్..!

బాబు బంగారం హిట్ తో కొద్దికాలంగా నత్తనడక నడిచిన విక్టరీ వెంకటేష్ కెరియర్ మళ్లీ ఊపందుకుంది. తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన బాబు బంగారం వెంకటేష్ ను మళ్లీ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించేశారు. ఇప్పటినుండి వరుస సినిమాలు చేసే ప్లాన్లో ఉన్న వెంకటేష్,  తర్వాత 'సాలా ఖదూస్' రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాత్రుక దర్శకురాలు సుధ కొంగర తెలుగు వర్షన్ కూడా డైరెక్ట్ చేస్తుండటం విశేషం.  

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 'గురు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. మాధవన్ నటించిన హిందీ, తమిళ సినిమా ఐన సాలా ఖదూస్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా రీమేక్ గా గురు మూవీతో వెంకటేష్ మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవనుంది. మాత్రుకలో నటించిన మెయిన్ లీడ్ ఆర్టిస్ట్ రీతికా సింగ్ కూడా తెలుగులో తన పాత్ర తానే చేస్తుంది.

గురుగా గురి పెడుతున్న వెంకటేష్ ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి. ఇప్పటికే సినిమా కోసం జిమ్ కెళ్లి బాడి ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టారు వెంకటేష్. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే స్టార్ట్ అవనుంది. ఈ సినిమా తర్వాత కూడా వెంకటేష్ రెండు మూడు సినిమాలను పైప్ లైన్లో ఉంచారు.