స్మార్ట్ ఫోన్లు పంచిన సోనూ సూద్..!

కరోనా లాక్ డౌన్ టైంలో రియల్ హీరోగా అనిపించుకున్న సోనూ సూద్ తన సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. ఈమధ్యనే ఏపీలో వర్షిత అనే చిన్నారి గుండె ఆపరేషన్ కు ఆర్ధిక సహాయాన్ని అందించారు సోనూసూద్. తను నటిస్తున్న చిరంజీవి ఆచార్య సినిమా యూనిట్ కు తన తరపున కానుకలు అందించాడు సోనూ సూద్. ఆచార్య సినిమాలో స్పెషల్ రోల్ చేసిన సోనూ సూద్ చిత్రయూనిట్ 100 మందికి స్మార్ట్ ఫోన్లు గిఫ్టులుగా ఇచ్చాడు. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఆచార్య సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. 2021 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నట్టు తెలిసిందే.