
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత వరుస సినిమాలు సైన్ చేశాడు. క్రిష్ తో పిరియాడికల్ మూవీ చేస్తున్న పవన్ ఆ సినిమాతో పాటుగా అయ్యప్పనుం కోషియం రీమేక్ షూటింగ్ లో కూడా ఒకేసారి పాల్గొంటారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ సినిమా కూడా లైన్ లో పెట్టాడు పవర్ స్టార్. గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ అవడం పట్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా మెసేజ్ కూడా ఇస్తానని అంటున్నాడు డైరక్టర్ హరీష్ శంకర్.
ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న కియరా అద్వాని సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవగా రాం చరణ్ తో చేసిన వినయ విధేయ రామ సినిమా మాత్రం నిరాశపరచింది. తెలుగులో ఛాన్సులు వస్తున్నా తన ఫోకస్ మొత్తం హిందీ సినిమాల మీదే పెట్టిన కియరా పవర్ స్టార్ తో జోడీ కట్టబోతుందని తెలుస్తుంది.