
అంతకుముందు ఎలాంటి ఇమేజ్ ఉన్నా సరే పూరీతో సినిమా చేస్తే హీరో ఇమేజ్ పూర్తిగా మారాల్సిందే. ఉన్న క్రేజ్ డబుల్ అవడమే కాకుండా తమ అభిమాన హీరోని కొత్తగా చూపిస్తాడని పూరీ మీద స్టార్ హీరోల ఫ్యాన్స్ నమ్మకం. అందుకే స్టార్ హీరోలతో పూరీ చేసిన ఒక్కో సినిమా ల్యాండ్ మార్క్ మూవీగా సెట్ చేశాడు. ప్రస్తుతం పూరీ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా వస్తుంది.
ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డితో టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారిన విజయ్ దేవరకొండ ఈసారి నేషనల్ వైడ్ గా తన సత్తా చాటనున్నాడు. విజయ్ దేవరకొండ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ కె.జి.ఎఫ్ హీరో యశ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పూరీ డైరక్షన్ లో యశ్ సినిమా అది కూడా పాన్ ఇండియా మూవీ ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది.
పూరీ సినిమాలో హీరో అంటే మాస్ ఇమేజ్ కంపల్సరీ.. అయితే కె.జి.ఎఫ్ తో మాస్ ఆడియెన్స్ కు దగ్గరైన యశ్ తో పూరీ లాంటి డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరక్టర్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.