ఆడియో రైట్స్ 4 కోట్లు..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మెగా మేనియాని కొనసాగిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోతుంది. సినిమా ఆడియో రైట్స్ 4 కోట్లకు ఆదిత్యా మ్యూజిక్ వారు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

మెగాస్టార్ సినిమా రేంజ్ అంటే ఏంటో తెలిపేలా ఈ ఆడియో రైట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో రాం చరణ్ కూడా  స్పెషల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. 2021 సమ్మర్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటించారు. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది. ఆచార్య ఆడియో రైట్స్ ఈ రేంజ్ లో ఉంటే థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఏ రేంజ్ బిజినెస్ చేస్తాయో చూడాలి.