శర్వానంద్ చేతికి మెగా మేనల్లుడి సినిమా..?

యువ హీరోలు ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం సర్వసాధారణమే.. తెర మీదకు వచ్చే దాకా ఏ కథను ఏ హీరో సెలెక్ట్ చేస్తాడు అన్నది చెప్పడం కష్టం. ఒక్కోసారి తమ దగ్గరకు వచ్చిన సూపర్ హిట్ సినిమాలను వద్దనేస్తారు హీరోలు. ఆ సినిమా హిట్ అయ్యాక అర్రె మంచి సినిమా మిస్ అయ్యామన్న భావన వస్తుంది.

లేటెస్ట్ గా ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేతికి వెళ్లిందని తెలుస్తుంది. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కు స్టార్ రైటర్ కోనా వెంకట్ ఓ స్టోరీ చెప్పాడట. మెడికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో కోనా వెంకట్ చెప్పిన కథ నచ్చినా ప్రస్తుతం కమిటైన సినిమాలు చాలా ఉండటం వల్ల ఈ సినిమా చేయనని చెప్పాడట సాయి ధరం తేజ్. ఇక మెగా మేనల్లుడు మిస్సైన ఈ సినిమాను మరో యువ హీరో శర్వానంద్ చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీకారం, మహా సముద్రం సినిమాలు చేస్తున్న శర్వానంద్ కోనా వెంకట్ సినిమాను ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ త్వరలో వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.