పదేళ్ల తర్వాత సూపర్ హిట్ సినిమా సీక్వల్..!

తమిళంలో సూపర్ హిట్టైన యుగానికి ఒక్కడు సినిమా తెలుగులో కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాతోనే కార్తీ తెలుగు తెరకు పరిచయం కాగా తమిళంలో అతనికి అది రెండో సినిమా. పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడు డైరక్టర్ సెల్వ రాఘవన్. 2024లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే యుగానికి ఒక్కడు సీక్వల్ ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే వన్ ఇయర్ దాకా టైం తీసుకుంటున్నారట. అంతేకాదు సినిమాలో హీరోగా కార్తికి బదులుగా ధనుష్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఒక హీరో నటించిన సినిమా సీక్వల్ కు మరో హీరోని సెలెక్ట్ చేయడం వెరైటీగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యుగానికి ఒక్కడు పార్ట్ 2 గురించి చెబుతూ ప్రిన్స్ 2024లో వస్తాడని ట్వీట్ చేశాడు. క్రేజీ సినిమా సీక్వల్ ప్రకటించగానే ధనుష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.