
RRR సినిమా చేస్తున్న ఎన్.టి.ఆర్ తన నెక్స్ట్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ వచ్చినా సరే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేక సైలెంట్ గా ఉన్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా త్రివిక్రం ను కలిశాడు ఎన్.టి.ఆర్. తమ సినిమా గురించి మాట్లాడేందుకే ఈ మీటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. సో సంక్రాంతికి ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ రానుందని చెప్పొచ్చు.
త్రివిక్రం తో ఎన్.టి.ఆర్ ఆల్రెడీ అరవింద సమేత సినిమా చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రెండో ప్రాజెక్ట్ త్వరలో షురూ చేస్తున్నారు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా త్రివిక్రం తో ఎన్.టి.ఆర్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.