
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. చిరు, చరణ్ ఇద్దరు కలిసి మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. రిలీజ్ కు ముందే ఆచార్య సినిమా రికార్డులు సృష్టిస్తుంది. సినిమా కోసం కోకాపేట్ లో 20 ఎకరాల్లో టెంపుల్ సెట్ వేశారట.
భారీగా ఏర్పాటుచేసిన ఈ సెట్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. అయితే సినిమా కోసం 20 ఎకరాల్లో టెంపుల్ సెట్ వేయడం మాత్రమే నేషనల్ వైడ్ గా ఇదే మొదటిసారని తెలుస్తుంది. అలా ఆచార్య రికార్డ్ నెలకొల్పింది. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు సోషల్ మెసేజ్ తో సినిమాలు చేస్తున్న కొరటాల శివ ఆచార్యతో కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో మెసేజ్ ఉన్నా మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని అంటున్నారు.