
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శాకుంతలం సినిమాలో కథనాయికగా అక్కినేని కోడలు సమంతని ఫిక్స్ చేశారు. జాను తర్వాత సమంత చేస్తున్న సినిమా ఇదే అవడం విశేషం. అంతేకాదు సమంత లీడ్ రోల్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా శాకుంతలం వస్తుంది. రుద్రమదేవి తర్వాత గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ శాకుంతలంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క, పూజా హెగ్దే నటిస్తారని అన్నారు. కాని వారిద్దరు కాకుండా సమంతకు ఆ ఛాన్స్ వచ్చింది. శాకుంతలగా సమంత అని డైరక్టర్ గుణశేఖర్ న్యూ ఇయర్ సందర్భంగా ఎనౌన్స్ చేశారు. సమంత కెరియర్ లో శాకుంతలం సినిమా స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత కూడా సమంత తన స్టార్డం కొనసాగిస్తుంది. గుణశేఖర్ మూవీలో సమంత అనగానే శాకుంతలంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
శాకుంతలం..కావ్యనాయకి.. 🤍
Shaakuntalam.. Kavyanayaki..
Here's the BIG REVEAL Motion poster https://t.co/S46JDIHmUN#Shaakuntalam#EpicLoveStory #MythologyForMillennials@Gunasekhar1 @neelima_guna #ManiSharma @GunaaTeamworks