
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రమణ తేజ డైరక్షన్ లో వస్తున్న సినిమా కిన్నెరసాని. మొదటి సినిమా విజేతతో మెప్పించలేని చిరు అల్లుడు మలి ప్రయత్నంగా చేస్తున్న సినిమా కిన్నెరసాని. డైరక్టర్ రమణ తేజ కూడా నాగ శౌర్యతో అశ్వథ్థామ సినిమా చేశాడు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవలేదు. డైరక్టర్ రమణ తేజ కూడా తన సెకండ్ మూవీగా కిన్నెరసాని చేస్తున్నాడు.
హీరో, డైరక్టర్ ఇద్దరు రెండో సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తున్నారు. ఇక ఈ ఫస్ట్ గింప్స్ విషయానికి వస్తే ఎటు వెళ్లాలో తెలియని హీరో అంతరంగాన్ని వివరిస్తూ వచ్చిన సూరూడికి కనిపించని నా గుండెలో చితి మంటని అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో టీజర్ ఇంప్రెస్ అయ్యేలా చేశారు. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే చలో, భీష్మ సినిమాలతో మ్యూజిక్ పరంగా హిట్ అందించిన మహతి సాగర్ కిన్నెరసాని సినిమాకు కూడా ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేలా ఉన్నాడు. కళ్యాణ్ దేవ్ ఫస్ట్ గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.