ఓ రచయిత ప్రేమ కథ..!

నాగ వర్మ హీరో కమ్ ప్రొడ్యూసర్ గా వస్తున్న సినిమా విక్రమ్. హరి చందన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సురేష్ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రచయిత ప్రేమ కథగా వస్తున్న ఈ సినిమా ఇంతకుముందు వచ్చిన ప్రేమ కథలన్నిటికన్నా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు డైరక్టర్ హరిచందన్. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి శిష్యుడైన సురేష్ ప్రసాద్ విక్రమ్ కు మ్యూజిక్ అందిస్తున్నారు. అందుకే ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను కోటి చేతుల మీదగా రిలీజ్ చేశారు.             

మొదటి సాంగ్ చుక్కలాంటి అమ్మాయి సాంగ్ రిలీజ్ చేసిన కోటి సాంగ్ చాలా బాగుందని.. సినిమాలో అన్ని సాంగ్స్ చాలా బాగా వచ్చాయని అన్నారు. నేటి యువతరం ఆలోచనలకు దగ్గరా ఉన్న కథగా విక్రమ్ సినిమా మంచి విజయం సాధించాలని కోటి అన్నారు. రైటర్ లవ్ స్టోరీగా వస్తున్న విక్రమ్ సినిమాలో హీరోగా నటిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నాగ వర్మ. సినిమాలో నాగ వర్మ సరసన దివ్యా రావు హీరోయిన్ గా నటిస్తుంది.