రవితేజ 'ఖిలాడి' డబుల్ యాక్షన్..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేశారు. వీర తర్వాత రమేష్ వర్మతో రవితేజ చేస్తున్న సినిమా ఇది. సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. డబుల్ యాక్షన్ తో తన ఫ్యాన్స్ కు డబుల్ ట్రీత్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు రవితేజ.

ఇక రిలీజ్ చేసిన పోస్టర్ లో తుపాకి పట్టుకుని ఒకరు.. అదే తుపాకి గురిలో మరొకరు ఉన్నారు. ఒకరు భయపడుతూ ఉండగా.. మరొకరు భయపెట్టే చూపులతో ఉన్నారు. మరి ఈ ఇద్దరి రవితేజల కహాని ఏంటో తెలియాలంటే ఖిలాడి సినిమా చూడాల్సిందే. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.