
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ గా చేస్తున్న సినిమా వకీల్ సాబ్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నారు. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ టీజర్ సంక్రాంతికి వస్తుందని తెలుస్తుంది.
ఇక న్యూ ఇయర్ సందర్భంగా వకీల్ సాబ్ సినిమా నుండి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. బైక్ పై స్టైలిష్ గా పవన్ కళ్యాణ్, శృతి హాసన్ రైడ్ చేస్తున్న పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్ చూస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈమధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ సినిమాను ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. వకీల్ సాబ్ తర్వాత క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాగర్ చంద్ర దర్శకులతో వరుస సినిమాలు ఫిక్స్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.