
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. డాన్ శీను, బలుపు సినిమాల తర్వాత గోపీచంద్, రవితేజ కలిసి చేసిన హ్యాట్రిక్ మూవీగా క్రాక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ గురించి చెప్పుకుంటే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించాడు.
విలన్ గా సముద్ర ఖని నటించారు. హీరో, విలన్ ల మధ్య జరిగే ఫైట్ క్రాక్ సినిమా కథ. అయితే కథ పూర్తిగా రివీల్ చేయకుండా ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్స్ తోనే నింపేశాడు డైరక్టర్. మాస్ రాజా ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందనిపిస్తుంది. థమన్ మ్యూజిక్, శృతి హాసన్ కూడా సినిమాకు ప్లస్ అవనున్నారని తెలుస్తుంది. రాజా ది గ్రేట్ తర్వాత హిట్టు కోసం తపిస్తున్న రవితేజకు క్రాక్ ఆశించిన స్థాయిలో హిట్ అందిస్తుందా లేదా అన్నది సంక్రాంతికి రిలీజ్ అయితేనే కాని తెలుస్తుంది.