
2020 చివరి రోజు కూడా టాలీవుడ్ కు విషాదం మిగిల్చింది. ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్ కు డయాలసిస్ జరుగుతున్నట్టు సమాచారం. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్ గుదువారం కన్నుమూశారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నర్సింగ్ యాదవ్ దాదాపు 300ల సినిమాలకు పైగా నటించారు. తెలుగులో హేమాహేమీలు సినిమా ద్వారా తెరకు పరిచయమైన నర్సింగ్ యాదవ్ రాం గోపాల్ వర్మ సినిమాలతో పాపులర్ అయ్యారు. ఒకప్పుడు ఆర్జీవి సినిమా అంటే నర్సింగ్ యాదవ్ తప్పనిసరిగా కనిపించే వారు. నర్సింగ్ యాదవ్ చివరగా ఖైదీ నంబర్ 150 సినిమాలో నటించారు. నర్సింగ్ యాదవ్ మరణ వార్త విన్న తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది.