
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2021 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్.. ప్రేరణ పాత్రలో పూజా హెగ్దే కనిపిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. న్యూ ఇయర్ కు టీజర్ వస్తుందని అనుకోగా అది కాస్త సంక్రాంతికి వాయిదా పడినట్టు తెలుస్తుంది. 2021 సంక్రాంతికి ప్రభాస్ రాధే శ్యామ్ టీజర్ వస్తుందని తెలుస్తుంది. ఈ టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్ పక్కా అని తెలుస్తుంది.