తనయుల పెళ్ళిపై నాగ్ క్లారిటీ ఇచ్చాడు

ప్రస్తుతం హాట్ న్యూస్ గా నడుస్తున్న టాలీవుడ్ లవ్ ఎఫైర్ నాగచైతన్య, సమంతల సీక్రెట్ రిలేషన్. మొన్నటిదాకా సీక్రెట్ గా ఉంచిన వీరు అంతా ఓపెన్ చేసేయడంతో రెండు రోజులకో హాట్ న్యూస్ బయటకు వస్తోంది. ఇక ఇంటా బయట తనయుల పెళ్లి గురించి హాట్ టాపిక్ అవ్వడంతో నాగార్జున మీడియా ముందు వచ్చేప్పుడు అలాంటి ప్రశ్నలకు ఆన్సర్ కూడా ప్రిపేర్ అయ్యి వస్తున్నాడు. ఇన్నాళ్ల నుండి కన్ఫ్యూజన్ గా ఉన్న చైతు, అఖిల్ ల మ్యారేజ్ విషయాల గురించి నాగ్ మొత్తం ఓపెన్ అయ్యాడు.

చైతు, సమంతల లవ్ మాత్రమే కాదు అఖిల్, శ్రీయా భూపాల్ రిలేషన్ గురించి చెప్పేసిన నాగార్జున అఖిల్ ఎంగేజ్మెంట్ డిసెంబర్ 9న డిసైడ్ చేశారట. ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రీయా, అఖిల్ చిన్ననాటి స్నేహితురాలు ఒకరినొకరు ఇష్టపడటంతో వారి పెళ్లికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక చైతు మ్యారేజ్ గురించి కూడా ప్రస్థావించిన నాగార్జున.. చైతు గురించి మీడియానే రాస్తుందిగా తనకు కాబోయే ఆమె ఎవరో.. వాళ్ల ఇష్టం కన్నా తనకేం ఎక్కువ కాదు అందుకే చైతు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు వారి పెళ్లి చేసేందుకు సిద్ధమే అనేశాడు నాగార్జున.

కాబట్టి తనయుల పెళ్లి విషయంపై కన్ఫ్యూజన్ క్లియర్ చేసిన నాగార్జున రీల్ లైఫ్ హీరోనే కాదు వారి ప్రేమను యాక్సెప్ట్ చేసి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. అయితే ఎలాగో పర్సనల్ లైఫ్ కు ఓ కంక్లూజన్ ఇచ్చేశాడు కాబట్టి ఇక ప్రొఫెషనల్ గా వారిని స్టార్స్ చేసే బాధ్యతతో ముందడుగేస్తున్నాడు నాగార్జున.