మోనాల్ డిమాండ్ అలా ఉంది..!

బిగ్ బాస్ సీజన్ 4 లో చివరి వారం ఎలిమినేట్ అయిన మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ వల్ల సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు ఆడియెన్స్ దాదాపు మర్చిపోయిన ఈ అమ్మడిని మళ్లీ ఫాం లోకి వచ్చేలా చేశారు బిగ్ బాస్ టీం. హౌజ్ లో 14 వారాల పాటు ఉన్న మోనాల్ తన టాలెంట్ తో మెప్పించింది. ఇక బయటకు వచ్చిన మోనాల్ కు మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఆల్రెడీ మోనాల్ ను స్టార్ మా డ్యాన్స్ షో డ్యాన్స్ ప్లస్ కు జడ్జ్ గా సెలెక్ట్ చేశారు.

ఇక మరోపక్క బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ గజ్జర్ ను ఫిక్స్ చేశారు. సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మోనాల్ స్పెషల్ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సాంగ్ కోసం అమ్మడు 12 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. బిగ్ బాస్ కు ముందు చేతిలో అవకాశాలు లేని మోనాల్ అలా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిందో లేదో ఇలా వరుస ఛాన్సులు వస్తున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అల్లుడు అదుర్స్ సినిమాలో మోనాల్ స్పెషల్ సాంగ్ బిగ్ బాస్ ఆడియెన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వనుంది.