బన్ని వదిలేస్తే అఖిల్ కు సెట్ అయ్యింది..!

అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఇచ్చాడో అదే రేంజ్ లో అపవాదాలు మూటకట్టుకున్నాడు. కుర్రాడి స్పీడ్ అక్కినేని ఇంట సరైన వారసుడు వచ్చాడని అనిపించినా ఆ సినిమా ఫలితం అఖిల్ ను భయపెట్టేసింది. అందుకే తన సెకండ్ సినిమా కోసం డైరక్టర్స్ ను తెగ ఇబ్బంది పెడుతున్నాడు. వంశీ పైడిపల్లి నుండి విక్రమ్ దాకా నానా హంగామా చేసి చవరకు విక్రమ్ తో ఫిక్స్ అయ్యాడు అఖిల్. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి అల్లు అర్జున్ సహాయపడ్డాడట. అదెలా అంటే సరైనోడు తర్వాత విక్రమ్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడట బన్ని. 24 హిట్ తో టాప్ రేంజ్ డైరక్టర్ అయిన విక్రమ్ బన్ని మార్క్ స్టైలిష్ ఎంటర్టైనర్ కథ సిద్ధం చేశాడట.

అయితే ఈ లోపే అఖిల్ చూపు విక్రమ్ పై పడటం నాగార్జున గమనించి విక్రమ్ ను సినిమా చేస్తావా అని అడిగేశాడట. తాను బన్నికి కమిట్ అయిన విషయాన్ని నాగ్ కు చెప్పగా అల్లు అరవింద్ తో మాట్లాడి విక్రమ్ అఖిల్ తోనే సినిమా చేసేందుకు ఒప్పించారట. అలా అఖిల్, విక్రమ్ కాంబినేషన్ షురూ అయ్యేందుకు ఇంత మ్యాటర్ జరిగిందన్నమాట. అయితే దీనికి కారణమైన అల్లు అరవింద్ కు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.

అయితే బన్నికి చెప్పిన కథనే అఖిల్ తో తీస్తున్నారా లేక వేరే కథా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి అఖిల్ సినిమా రిలీజ్ అయిన సంవత్సరం కాలానికి తన సెకండ్ సినిమా పక్కా ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. 24 హిట్ తో విక్రమ్ తన మీద బరువు బాధ్యతలను మరింత వేసుకున్నాడు. మరి అఖిల్ ను విక్రమ్ ద్వితియ విఘ్నం నుండి కాపాడతాడో లేదో చూడాలి.