
బాలీవుడ్ పింక్ తెలుగు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా మంగళవారంతో షూటింగ్ పూర్తి చేసుకుంది. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా అది కుదరలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం వకీల్ సాబ్ సినిమాను 2021 ఏప్రిల్ 9న రిలీజ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
న్యూ ఇయర్ గిఫ్ట్ గా వకీల్ సాబ్ టీజర్ వస్తుందని అనుకోగా అది కూడా వచ్చేలా లేదని టాక్. సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాగర్ చంద్ర వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్.