
R.R.R సినిమా తర్వాత రాం చరణ్ ఎవరితో సినిమా చేస్తాడన్న కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ట్రిపుల్ ఆర్ తో పాటుగా ఆచార్య సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేసే ఆలోచనలో ఉన్న చరణ్ తన నెక్స్ట్ సినిమా జెర్సీ డైరక్టర్ గౌతం తిన్ననూరితో చేస్తాడని తెలుస్తుంది. మళ్లీ రావా సినిమాతో మెప్పించిన గౌతం తిన్ననూరి నానితో తీసిన జెర్సీ సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తున్నాడు గౌతం. అందుకే ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ గౌతం తిన్ననూరితో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు 2021 సమ్మర్ ముహుర్తం ఫిక్స్ చేశారట. ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రాం చరణ్ రామ రాజు పాత్రలో కనిపించనున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కూడా నటిస్తున్నాడు.