
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యాం షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ సినిమాను 2021 ఏప్రిల్ 30న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.
కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పూర్తి కాగానే కొద్దిపాటి గ్యాప్ తోనే ప్రశాంత్ నీల్ సలార్ ను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దిశా పటానిని ఒక హీరోయిన్ గా ఫిక్స్ చేయగా మూవీలో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్టు టాక్. తెలుగులో ఫిదా సినిమాతో సూపర్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి వరుస ఛాన్సులతో మెప్పిస్తుంది. నాగ చైతన్య లవ్ స్టోరీ, రానా విరాటపర్వం సినిమాల్లో నటిస్తున్న సాయి పల్లవి ప్రభాస్ సలార్ లో కూడా లక్కీ ఛాన్స్ అందుకుందని టాక్.