
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ ఊహించిన దాని కన్నా ఓ రేంజ్ సక్సెస్ అవడంతో తారక్ మస్త్ జబర్దస్త్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఇక ఇదే జోరులో తన తర్వాత సినిమాల గురించి ఆలోచించడం మొదలెట్టాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో ట్రాక్ లోకి ఎక్కిన జూనియర్ గ్యారేజ్ హిట్ తో మరోసారి తన సత్తా ఏంటో చాటుతున్నాడు. ఇక ఈ సినిమా కాగానే వక్కంతం వంశీతో సినిమా ఓకే చేసిన తారక్ ఆ సినిమాకు కొద్దిపాటి టైం తీసుకుంటున్నాడట. అయితే ఇంతలోనే జూనియర్ తర్వాత చేసే సినిమా వక్కంతం వంశీతో కాదు పూరితో అని మళ్లీ ఓ రెండు రోజుల నుండి హడావిడి మొదలైంది.
ఓ వైపు తనకోసమే దర్శకుడిగా మారడానికి దాదాపు రెండు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్న వక్కంతం వంశీ, మరోవైపు కళ్యాణ్ ఇజం టీజర్ తో మరోసారి తన సత్తా చాటిన పూరి. ఖచ్చితంగా ఈ ఇద్దరిలో ఒకరు తారక్ తర్వాత సినిమా డైరక్టర్. కాని వీరిలో పూరి అని కొందరు కాదు కాదు వంశీ అని ఇంకొందరు అంటున్నారు. అయితే ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఏంటంటే జనతా గ్యారేజ్ బిజీ షెడ్యూల్ లో అలసిపోయిన తారక్ తన తర్వాత సినిమాకు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చేయాలని అనుకుంటున్నాడట.
అయితే లేట్ అయినా సరే తారక్ సినిమా పూరితోనే ఉంటుందని ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తున్న న్యూస్. ఇందులో విచిత్రం ఏంటంటే వక్కంతం వంశీ కథను పూరి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందట. ఇప్పటికే టెంపర్ అలానే చేసి జూనియర్ కు మంచి టర్న్ ఇచ్చేశారు. మరి మరోసారి రాబోతున్న ఈ క్రేజీ కాంబో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.