మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం.. చరణ్ కే కాదు వరుణ్ తేజ్ కు కూడా..!

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టిస్తుంది. కొద్దిగంటల క్రితమే రాం చరణ్ తనకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని ప్రకటించాడు రాం చరణ్. ఎలాంటి లక్షణాలు లేకపోయినా సరే తను హోం క్వారెంటైన్ లో ఉంటునానని.. ఈమధ్య కాలంలో తనతో సన్నిహితంగా ఉన్న అందరు టెస్టులు చేయించుకోవాలని సూచించారు చరణ్. 

ఇక అన్నకి పాజిటివ్ వచ్చిందో లేదో తను టెస్ట్ చేయించుకోగా తమ్ముడికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు స్వయంగా వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా వెళ్లడించాడు. మైల్డ్ సింటమ్స్ ఉన్నట్టుగా చెప్పిన వరుణ్ తేజ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని వెళ్లడించి. త్వరలోనే రికవర్ అవుతానని అన్నారు. మొత్తానికి కరోనా మెగా ఫ్యామిలీ మీద ఎటా చేస్తుంది. ఆల్రెడీ మెగా బ్రదర్ నాగబాబుకి కరోనా రావడం రెండు వారాల తర్వాత నెగటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. 

మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్ అంటూ ఆమధ్య హడావిడి చేశారు. అయితే కిట్ ప్రాబ్లం అని చెప్పి మరోసారి టెస్ట్ చేయించుకోగా చిరుకి ఫైనల్ గా నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిసిందే. చరణ్, వరుణ్ ఇద్దరు తమకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని ప్రకటించారు. రెండు వారాలు వారు హోం క్వారెంటైన్ లో ఉంటారని తెలుస్తుంది.