
అక్కినేని మనం చూసిన తర్వాత నందమూరి, దగ్గుబాటి, మెగా ఫ్యామిలీల్లో కూడా అలాంటి ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమా కథల కోసం తెగ వెతికేశారు. నందమూరి మనం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉండగా.. దగ్గుబాటి మల్టీస్టారర్ కోసం ఆ హీరోల ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే దగ్గుబాటి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా దగ్గుబాటి మల్టీస్టారర్ స్టోరీ ఓకే అయ్యిందట. శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్న ఈ సినిమా కథ సిద్ధం చేశాడని తెలుస్తుంది.
దగ్గుబాటి మల్టీస్టారర్ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తాడని తెలుస్తుంది. సతీష్ వేగేశ్న డైరక్టర్ అంటే దగ్గుబాటి మల్టీస్టారర్ సినిమా మరో మనం కాబోతుందని అంటున్నారు దగ్గుబాటి ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమా చేస్తుండగా.. రానా విరాటపర్వం.. పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం రీమేక్ లో నటిస్తున్నడని తెలుస్తుంది.