
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నూతన దర్శకుడు వశిష్ఠతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. డైరక్టర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన కళ్యాణ్ రామ్ ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా డూ ఆర్ డై అని ఫిక్స్ చేశారని టాక్. 118తో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఈ సంక్రాంతికి వచ్చిన ఎంత మంచివాడవురా సినిమాతో నిరాశపరచాడు.
కథల విషయంలో జాగ్రత్త వహిస్తున్న కళ్యాణ్ రామ్ డూ ఆర్ డైతో బాక్సాఫీస్ పై నిజంగానే తాడో పేడో తేల్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో త్రివిక్రం, ఎన్.టి.ఆర్ సినిమాను కూడా కళ్యాణ్ రామ్ నిర్మాణంలో భాగం అవుతున్నాడని తెలుస్తుంది.