ఏ.ఆర్. రెహమాన్ ఇంట విషాదం

మ్యూజిక్ డైరక్టర్, ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం చోటు చేసింది. రెహమాన్ తల్లి కరీమా బేగం సోమవారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. రెహమాన్ తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన తండ్రి ఆర్.కే శేఖర్ మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రెహమాన్ తల్లి  కరీమా బేగం ఈరోజు కన్నుమూశారు. సంగీత ప్రపంచంలో రెహమాన్ గురించి తెలియని వారు ఉండరు. తల్లి చనిపోయిన విషయాన్ని తెలియచేస్తూ కరీమా బేగం ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు రెహమాన్.