సంక్రాంతి రేసులో మరో సినిమా..!

2020 కరోనా వల్ల సినిమాలు రిలీజ్ ఆగిపోగా 2021 సంక్రాంతి నుండి సినిమాల సందడి మొదలవనుందని తెలుస్తుంది. డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా రిలీజైన సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా వసూళ్లు బాగానే ఉండటంతో సంక్రాంతి సినిమాలకు భరోసా వచ్చింది. 2021 సంక్రాంతికి ఇప్పటికే రెండు మూడు సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకోగా ఈ రేసులో మరో సినిమా వచ్చింది. 

బెల్లంకొండ శ్రీనివాస్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే రామ్ రెడ్, రవితేజ క్రాక్ సినిమాలతో పాటుగా అల్లరి నరేష్ బంగారు బుల్లోడు పొంగల్ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇక లేటెస్ట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ కూడా సంక్రాంతికి వస్తుందని తెలుస్తుంది. ఈ సంక్రాంతికి యువ హీరోల సినిమాల సందడి ఉండబోతుందని చెప్పొచ్చు.