గుణశేఖర్ 'శాకుంతలం'లో పూజా హెగ్దే..?

రుద్రమదేవి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ తన నెక్స్ట్ సినిమా రానాతో హిరణ్యకశ్యప ఉంటుందని అనుకున్నారు కాని ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టి శాకుంతలం అని కొత్త సినిమా షురూ చేశాడు గుణశేఖర్. సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే ఆసక్తి పెంచిన గుణశేఖర్ ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ ఏంటో చూపించబోతున్నాడు.

ఇక గుణశేఖర్ శాకుంతలం సినిమాలో అనుష్క నటిస్తుందని అన్నారు. కాని లేటెస్ట్ న్యూస్ ప్రకారం శాకుంతల పాత్రలో పూజా హెగ్దేని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో గుణశేఖర్ శాకుంతల పాత్రకు బుట్టబొమ్మని ఫైనల్ చేసినట్టు టాక్. టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దే వరుస స్టార్ సినిమాలు చేస్తుంది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సై అంటుంది. తప్పకుండా పూజా హెగ్దేకి టాలీవుడ్ లో మరో ఐదారేళ్లు తిరుగులేదని చెప్పొచ్చు.