
మెగాస్టార్ చిరంజీవి ఏంటి వెక్కి వెక్కి ఏడవడం ఏంటి.. అసలు ఆయనకు ఏడవాల్సిన అవసరం ఏంటి అనుకోవచ్చు. స్వయంకృషితో పైకొచ్చి మెగాస్టార్ గా.. బాక్సాఫీస్ బాద్షాగా మారడానికి చిరుకి చాలా టైమే పట్టింది. అయితే ఆయన కూడా ఓ సినిమా విషయంలో ఏడ్చినట్టుగా చెప్పారు. ఖైది సూపర్ హిట్ అవడంతో చిరంజీవికి మాస్ ఇమేజ్ రాగా ఆ తర్వాత వచ్చిన వేట సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమా పోవడం తనని చాలా బాధపెట్టిందని అన్నారు చిరు. ఆ టైం లో ఇంట్లో దుప్పటి కప్పుకుని ఏడ్చినట్టుగా చెప్పుకొచ్చారు.
రీసెంట్ గా సమంత హోస్ట్ నిర్వహిస్తున్న సామ్ జామ్ షోకి గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమా పోవడంతో ఏడ్చిన సందర్భాన్ని గుర్తుచేశారు. అంతేకాదు తన సినిమాలు రీమేక్ చేస్తే ఏ సినిమా ఏ స్టార్ కు సూట్ అవుతుందో కూడా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. ఆహాలో క్రిస్మస్ కానుకగా ఈ ఇంటర్వ్యూ అందుబాటులో ఉంచారు.