
దిల్ రాజు బ్యానర్ లో సిద్ధార్థ్ హీరోగా భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా బొమ్మరిల్లు. ఈ సినిమాలో జెనిలియా హీరోయిన్ గా నటించింది. తెలుగు సూపర్ హిట్ సినిమా.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన సినిమాగా బొమ్మరిల్లు నిలిచింది. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటాడని అనుకోగా సరైన కథల ఎంపిక చేసుకోలేక వెనకపడ్డాడు. ఇక తమిళంలోనే వరుస సినిమాలు చేస్తూ మెప్పించాడు.
ఇక ఈమధ్యనే శర్వానంద్ తో మహా సముద్రం సినిమాలో నటిస్తున్నాడు సిద్ధార్థ్. అజయ్ భూపతి డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత దిల్ రాజు సిద్ధార్థ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. బొమ్మరిల్లు తర్వాత ఓ మై ఫ్రెండ్ సినిమా దిల్ రాజు నిర్మించాడు. అయితే పదేళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందని తెలుస్తుంది. తప్పకుండా వీరి కాంబో మూవీ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.