సంబంధిత వార్తలు

సూపర్ స్టార్ రజినీ కాంత్ కు కరోనా పాజిటివ్ లక్షణాలతో పాటు హై బీపీ కారణంగా అనారోగ్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ లో శుక్రవారం ఉదయం చేరినట్టు సమాచారం. రజినీ అనారోగ్యానికి గురైన విషయాన్ని అపోలో హాస్పిటల్ నుండి కూడా అఫీషియల్ న్యూస్ వచ్చింది.
రజినీ కాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ కోసం వచ్చిన రజిని చిత్రయూనిట్ లో కొందరు కరోనా బారిన పడడంతో సినిమా షూటింగ్ ఆపేసినట్టు తెలుస్తుంది. రజినీకి అస్వస్థత, కరోనా లక్షణాలు కనబడటం అనే వార్తలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కంగారు పడేలా చేస్తున్నాయి.