టక్ జగదీష్ ఫస్ట్ లుక్.. నాని ఈసారి ఫుల్ మీల్స్ పక్కా అట..!

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేశారు. నాని సీరియస్ లుక్ తో వెనక కత్తి పెట్టుకుని భోజనానికి కూర్చుకున్నాడు. నాని ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ ట్విట్టర్ లో ఈసారి ఫుల్ మీల్స్ అని పెట్టాడు. అంటే నాని తన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా అని చెప్పకనే చెప్పాడు.   

అల్రెడీ శివ నిర్వాణ డైరక్షన్ లో నాని నిన్ను కోరి సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ అవడంతో ఇద్దరు కలిసి చేస్తున్న రెండో సినిమా మీద అంచనాలు పెరిగాయి. టక్ జగదీష్ సినిమాలో నాని సరసన ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ హిట్లతో డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న శివ నిర్వాణ టక్ జగదీష్ తో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.