
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా రెడ్. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన తడం రీమేక్ గా రెడ్ మూవీ తెరకెక్కింది. స్రవంతి రవికిశోర్ నిర్మాతగా రూపొందించిన ఈ సినిమాలో రామ్ డ్యుయల్ రోల్ చేయడం విశేషం. 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తరహాలోనే ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ట్రీట్ ఇచ్చేలా ఉంది.
కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన హిట్ లేని రామ్ పూరీ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ జోష్ తోనే రెడ్ అంటూ రాబోతున్నాడు. సినిమాలో రామ్ రెండు పాత్రల్లో అదరగొట్టినట్టు తెలుస్తుంది. రెడ్ సినిమాతో రామ్ తన హిట్ మేనియా కొనసాగిస్తాడో లేదో చూడాలి.