అందరిని దాటేసిన విజయ్ దేవరకొండ..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన సత్తా చాటాడని చెప్పొచ్చు. తెలుగు హీరోలందరిని వెనక్కి నెట్టేసి టాప్ లో నిలిచాడు. ఇంతకీ స్టార్స్ అందరిని పక్కన పెట్టి విజయ్ ఎలా నెంబర్ 1 అయ్యాడు అంటే సోషల్ మీడియా ఫాలోయింగ్ లో అని తెలుస్తుంది. విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం ఖాతాల్లో సూపర్ ఫాలోవర్స్ ఉంటారు. 

విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రాం లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే విజయ్ ఒక్క పోస్ట్ చేస్తే కోటి మందికి రీచ్ అవుతుందన్నమాట. తెలుగులో సూపర్ స్టార్స్ అంతా కూడా ఈ మైల్ స్టోన్ అందుకోవడంలో వెనకపడగా విజయ్ దేవరకొండ మాత్రం కోటి ఫాలోవర్స్ తో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. మహేష్, అల్లు అర్జున్, పవన్, ఎన్.టి.ఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ అంతా ఇన్ స్టాగ్రాం లో 10 మిలియన్ ఫాలోవర్స్ అందుకోలేదు. అందరిని దాటేసి విజయ్ దేవరకొండ ముందు నిలిచాడు. ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్యా పాండే నటిస్తుంది.