నాని 'V' థియేటర్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పండుగే..!

నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన సినిమా V. ఈ సినిమాను మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించారు. సినిమాను అమేజాన్ ప్రైం లో రిలీజ్ చేశారు. సినిమాలో నాని పూర్తిగా నెగటివ్ రోల్ లో నటించాడని తెలిసిందే. సినిమా పరంగా చూస్తే హీరో సుధీర్ బాబు, విలన్ నాని అన్నట్టుగా అనిపిస్తుంది. అమేజాన్ ప్రైం లో రిలీజై జస్ట్ ఓకే అనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు థియేటర్ వర్షన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

జనవరి 1న ఈ సినిమాను థియేటర్ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. దిల్ రాజు ఈ విషయాన్ని వెళ్లడించారు. నాని ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇదివరకు సినిమాలు థియేటర్ లో ఆడిన తర్వాత ఓటిటి లోకి వచ్చేవి కాని కరోనా వల్ల సీన్ రివర్స్ అయ్యింది. ఓటిటి లో ఓకే ఓకే అనిపించుకున్న వి థియేటర్ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.