అనసూయ 'థ్యాంక్యు బ్రదర్' మోషన్ పోస్టర్..!

యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా సత్తా చాటాలని చూస్తుంది. రెగ్యులర్ సినిమాలు కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్న అనసూయ లేటెస్ట్ గా థ్యాంక్యు బ్రదర్ సినిమాలో నటిస్తుంది. సినిమాలో ఫీమేల్ లీడ్ గా చేస్తున్న అనసూయ థ్యాంక్యు బ్రదర్ సినిమా మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేశారు.

విరాజ్ అశ్విన్ మేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాను రమేష్ రాపర్తి డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు సూపర్ స్టార్ మహేష్ థ్రిల్లింగ్ గా ఉన్న ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. చిత్రయూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు మహేష్.