F3 ఆఫర్ రిజెక్ట్ చేసిన మహేష్..?

సరిలేరు నీకెవ్వరు తర్వాత సూపర్ స్టార్ మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. 2019 సంక్రాంతికి రిలీజైన ఎఫ్2 సినిమా సీక్వల్ ప్లాన్ చేసాడు అనీల్ రావిపుడి. రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు నటిస్తున్నారు. ఎఫ్3 డబుల్ ట్రీట్ గ్యారెంటీ అని చెప్పిన అనీల్ రావిపుడి ఈ సినిమాలో థర్డ్ హీరో మహేష్ ని కూడా నటింపచేయాలని అనుకున్నారు.

మహేష్ తో ఆల్రెడీ సరిలేరు నీకెవ్వరు హిట్ అందుకున్న అనీల్ రావిపుడి ఎఫ్3 ఆఫర్ మహేష్ ముందు ఉంచగా సూపర్ స్టార్ మాత్రం సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తుంది. పరశురాం సినిమా తర్వాత త్రివిక్రం, వంశీ పడిపల్లి, కొరటాల శివ ముగ్గురు దర్శకులు మహేష్ తో సినిమా కోసం వెయిటింగ్ లో ఉన్నారు. అందుకే ఎఫ్3 ఆఫర్ ను మహేష్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి మహేష్ కోసం అనుకున్న ఆ పాత్రలో అనీల్ రావిపుడి ఎవరిని తీసుకుంటాడో చూడాలి.