నాలుగు నెలల్లోనే ప్రభాస్ సలార్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో సూపర్ ఫాంలో ఉన్నాడు. బాహుబలి తర్వాత తన ప్రతి సినిమా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యాం ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ డైరక్టర్ ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా ఉన్నా ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. 

ఇక ఈ గ్యాప్ లో కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ప్రభాస్. సలార్ అంటూ టైటిల్ పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచాడు ప్రభాస్. ఈ సినిమాను 2021 జనవరిలో స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు నాలుగు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. నాలుగు నెలల్లోనే ప్రభాస్ లాంటి స్టార్ తో సినిమానా అని ఆశ్చర్యపోవచ్చు. అయితే ప్రశాంత్ నీల్ అందుకు తగిన పర్ఫెక్ట్ ప్లాన్ సెట్ చేశాడట. మరి ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.