ఆది 'శశి' టీజర్.. మెగాస్టార్ బెస్ట్ విష్..!

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శశి. నూతన దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నడికట్ల ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఆది సాయి కుమార్ సరసన సురభి, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆర్.పి.వర్మ, సి. రామాంజనేయులు, చిలపూడి శ్రీనివాస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. బుధవారం ఆది బర్త్ డే సందర్భంగా ఆదికి బర్త్డే విషెస్ అందించిన చిరు.. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ తో ఆకట్టుకుంది. ఆది ఈ సినిమాలో మాస్ లుక్ తో కనిపిస్తున్నారు. ఇక రిలీజైన టీజర్ చూస్తే మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడే మొదటి క్షణాలు గుర్తొస్తాయి.. ఇష్టమైన పని చేయడానికి.. అవసరం కోసం పని చేయడానికి చాలా తేడా ఉంది లాంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.