మెగా ప్రోమో వచ్చేసింది..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా తన సత్తా చాటుతుంది. ఆహా లో సామ్ జామ్ షోతో సందడి చేస్తుంది అమ్మడు. విజయ్ దేవరకొండ, రానా, తమన్నా, రకుల్, అల్లు అర్జున్ ఇలా సెలబ్రిటీస్ పర్సనల్ విషయాల గురించి కూపీ లాగుతూ సరద సరదాగా షో నడుస్తుంది. ఇక లేటెస్ట్ గా క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ గా మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేశారు.

సమంత సామ్ జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఈ స్పెషల్ చిట్ చాట్ లో చిరు రొమాంటికా కాదా.. చిరు దోశ స్పెషల్ ఏంటి.. మెగాస్టార్ చిరంజీవి కళ్లకు గంతలు కట్టి కూడా దోశ ఫ్లిప్ చేస్తాడా.. చిరంజీవి ఇంట్లో ఫ్రిజ్ లో ఏముంటుంది లాంటి వాటితో ఇంట్రెస్టింగ్ ప్రోమో కట్ చేశారు. లేటెస్ట్ గా ఆ ప్రోమో రిలీజ్ చేసి షో మీద ఆసక్తి పెంచారు. మెగాస్టార్ మెగా ప్రోమో సూపర్ అంటున్నారు మెగా ఫ్యాన్స్.