
బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ ఆడియెన్స్ లో ఫోకస్ అయ్యేలా ప్లాన్ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అయిన అభిజిత్ 8 ఏళ్ల క్రితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ఇచ్చిన ఫలితం కన్నా ఎక్కువ జోష్ లో ఉన్నాడని చెప్పొచ్చు. టి.ఆర్.ఎస్ ఎంపి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అభిజిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన అభిజిత్.. తను కూడా బిగ్ బాస్ కంటెస్టంట్స్ ను నామినేట్ చేస్తున్నానని.. సోహెల్, హారిక, కళ్యాణిలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరాడు. బిగ్ బాస్ టైటిల్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన అభిజిత్ మళ్లీ తన పూర్తి ఫోకస్ కెరియర్ మీద పెడుతున్నట్టు తెలుస్తుంది. మరి అభిజిత్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి.