రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా..!

కరోనా ఉన్నా లేనట్టుగా.. లేకపోయినా ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. కరోనాతో కలిసి జీవించాలని మన నేతలు చెప్పినట్టుగానే కరోనా వచ్చినా మొదట్లో చేసిన హడావిడి చేయకుండా ఒక వారం పది రోజులు హోం క్వారెంటైన్ లో ఉండి.. ఆ తర్వాత మళ్లీ అందరితో కలుస్తున్నారు. దేశంలో కరోనా ఉన్నా సరే ప్రజలంతా తమ పనుల్లో బిజీ అయ్యారు. అయితే కరోనా పూర్తిగా పోలేదని మాత్రం అర్ధమవుతుంది.

ముఖ్యంగా కరోనా బారిన పడిన సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. లేటెస్ట్ గా సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ లిస్ట్ లో చేరింది. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ప్రకటించారు. ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. లక్షణాలు ఏమి లేవు.. ఆరోగ్యంగానే ఉన్నా అంటూ రకుల్ వెల్లడించారు.       

ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్నట్టుగా చెప్పిన రకుల్ పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలిపారు. తనతో రీసెంట్ గా కాంటాక్ట్ ఉన్న వారు కూడా టెస్ట్ చేయించుకోవాలని అంటుంది రకుల్. అయితే తమ అభిమాన హీరోయిన్ కు కరోనా అని తెలియగానే రకుల్ గురించి ఆమె ఫ్యాన్స్ అంతా కామెంట్ చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు.