రామ్ రెడ్ సంక్రాంతికే ఫిక్స్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా రెడ్. కోలీవుడ్ లో హిట్టైన తడం రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రాం సరసన మాళవిక శర్మ, అమృత అయార్ హీరోయిన్ గా నటించారు. ఈ ఇయర్ సమ్మర్ రిలీజ్ అనుకున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డది. 2021 సంక్రాంతికి రామ్ రెడ్ రిలీజ్ అని అన్నారు. అయితే సంక్రాంతి రిలీజ్ సినిమాల ఎనౌన్స్ మెంట్ వస్తుండగా రెడ్ టీం సైలెంట్ గా ఉన్నారు.

ఇప్పటికే రవితేజ క్రాక్ సినిమా సంక్రాంతికి రావడం పక్కా అని ఎనౌన్స్ చేయగా రెడ్ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం రామ్ రెడ్ సినిమా కూడా పొంగల్ రేసులో ఉంటుందట. న్యూ ఇయర్ కానుకగా ట్రైలర్ రిలీజ్ చేసి ఫస్ట్ వీక్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. రామ్ రెడ్ కూడా సంక్రాంతి రేసులో ఉంటుందని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ చేసిన  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.