బిగ్ బాస్ తర్వాత సోహెల్ కథ వేరే ఉంటుందా..?

బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 3లో ఉండి.. పాతిక లక్షల ఆఫర్ తో బయటకు వచ్చిన సోహెల్ తను కప్ కు గెలుచుకోలేకపోయిన ప్రేక్షకుల హృదయాలను మాత్రం గెలుచుకున్నాడు. పాతిక లక్షల్లో పది లక్షలు ఆర్పనైజ్ హోమ్స్ కు ఇచ్చేస్తానన్న అతని మంచి మనసుని అర్ధం చేసుకుని నీ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో ఆ పది లక్షలు నేనిస్తా అని బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున చెప్పారు.

అంతేకాదు గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కూడా నువ్వు సినిమా తీయ్.. నీకు నేను సపోర్ట్ చేస్తా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తా.. అవసరం అయితే నీ సినిమాలో ఓ కెమియో రోల్ కూడా చేస్తానని అన్నారు మెగాస్టార్. ఏయ్ సింగరేణి ముద్దుబిడ్డ అంటూ.. సోహెల్ ఊరపదం కథ వేరే ఉంటది అనే మాటలు కూడా చిరు నోట రావడం అతను ఎంతగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడన్నది అర్ధమవుతుంది.

చిరు మాత్రమే కాదు షో తర్వాత హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా ఫోన్ చేసి నువ్వు సినిమా తీయి నేను అందులో రెమ్యునరేషన్ లేకుండా నటిస్తానని చెప్పాడట. బిగ్ బాస్ కు ముందు ఏమో కాని బిగ్ బాస్ తర్వాత సోహెల్ కథ నిజంగానే వేరేలా ఉండేలా ఉంది.