మహేష్ @ 11 మిలియన్స్.. సౌత్ లో టాప్..!

సూపర్ స్టార్ మహేష్ ఖాతాలో మరో క్రేజీ రికార్డ్ వచ్చి చేరింది. ట్విట్టర్ లో మహేష్ 11 మిలియన్ ఫాలోవర్స్ తో సౌత్ హీరోల్లో నెంబర్ 1 అయ్యాడు. మహేష్ తర్వాత సౌత్ స్టార్స్ లో మహేష్ ను 11 మిలియన్ ఫాలోవర్స్ తో టాప్ ప్లేస్ లో ఉండగా ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 9.4 మిలియన్ ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. ఇక మళయళ స్టార్ మోహన్ లాల్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. మళయాళ స్టార్ మోహన్ లాల్ కు 6.2 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక టాలీవుడ్ క్రేజీ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు 4.1, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ట్విట్టర్ లో 5.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సూపర్ స్టార్ రజినికి 5.8, దళపతి విజయ్ కు 2.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్.ట్.ఆర్ కు 4.6 మిలియన్స్ ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తానికి సౌత్ లో మరోసారి మహేష్ తన క్రేజ్ ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ టైం లో ఇంట్లోనే ఉండి తన అప్డేట్స్ ను ఫ్యాన్స్ కు అందించిన సూపర్ స్టార్ ప్రస్తుతం ఉన్న 11 మిలియన్స్ కాదు మరో 10 మిలియన్ ఫాలోవర్స్ కూడా తెచ్చుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.